Sunday, September 9, 2007

Mahesh

శ్రీ పిఠాపురం నాగేశ్వరరావు గారు పాడిన కోన్ని ఆణిముత్యాలు కింద లంకె లో వినగలరు.Music Listing - Music India OnLine

5 Comments

నాకు తెలిసిన కొన్ని సామెతలు

(సామెతలు)
“ఒక కల గంటే తెల్లావరుతుందా”
“కత్తి పొటు తప్పినా, కలం పొటు తప్పదు”
“అన్నపు చొరవే గాని అక్షరం చొరవలేదు”
“ఉలి దెబ్బ తిన్న శిలే శిల్పం అవుతుంది”
“ఏటి ఆవల ముత్యాలు తాటికాయలంత అన్నట్లు”
“పెయ్యను కాపడమని పెద్దపులికి ఇచ్చినట్లు”
“తాడు చాలదని బావి పుడ్చుకున్నట్లు”
“పిల్లిని చంకన పెట్టుకొని పెళ్ళికి వెళ్ళినట్లు”
“నిప్పు ముట్టనిదే చెయి కాలదు”
“చేపపిల్లకు ఈత నేర్పవలేనా?”
4 Comments

మరికొన్ని..


(Uncategorized)

” నేను చదువులో ఏ మాత్రం వెనుక పడినా మా మాష్టారు ఊరుకోరు తెలుసా…?” అన్నాడు రాము.“
ఏం? నీమీద అంత ప్రత్యేకమైన అభిమానమా?” అడిగాడు రవి.
“అదేంగాదు”.“మరి….”“పరీక్ష్లలో మా మాష్టారు గారి అబ్బాయి కూర్చునేది నా వెనకాలే…” __________________________________________________________________________
సరిత: “నువు ప్రేమించిన వ్యక్తి ఎవరినైనా సరే ఎదిరించే దమ్మున్న మగాడని చెప్పావుగా? మరి పెళ్ళీ చేసుకోలేదేం?”
హరిత: :ఆఖరుకు నన్ను కూడా ఎదిరిస్తాడనుకోలేదు”.
__________________________________________________________________________
“మన పెళ్ళి లో మీనాన్న నాకాళ్ళు కడిగెటప్పుడు నా స్టయిల్ భలే ఉంది కదా!” అడిగాడు వీడియో చుస్తూ కొత్తపెళ్ళికోడుకు.

“అప్పుడు మానాన్న లొ నాకు వసుదేవుడు కనిపించాడు లేండి” చూరకంటించింది భార్యమణి.
____________________________________________________________
భార్య: “వంట మనిషిని తీసేసి మీకు వండిపెడితే నాకు ఎంత ఇస్తారు?”భర్త: ” ఇంకా నేను ఇవ్వాల్సిన అవసరమేముందే, నా ఎల్.ఐ.సి. పాలసీ సోమ్మంతా వెంటనే నీకు వచ్చేస్తుందిగా!”
___________________________________________________________________
“మొత్తానికి మన పరంధామయ్య గారి కొడుకులు ముగ్గురు ముగ్గురేనోయ్ “
“అలగా! ఇప్పుడు పెద్దడెక్కడున్నాడు?”
“జైల్లో”..
“రెండోవాడు?”
“బెయిల్లో”…
“మరి మూడోవాడు?”
“పరారీలో”….
_______________________________________________________
ఒక డాక్టర్ పేషేంట్ తో: ” నీకొచ్చిన రోగం ఏమిటో అంతుబట్టడం లేదోయ్. దీనికి కారణం బహుశా మత్తు పదార్దాలు సేవించడం అనుకుంటా”
పేషేంట్: “సర్లేండి డాక్టర్ గారు! మీరు మామూలు స్థితిలో ఉన్నప్పుడే వచ్చి చూపించుకుంటా”
______________________________________________________________________________
2 Comments

శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వర్ధంతి

(ఎందరో మహానుభావులు...)



మావికొమ్మ, కోయలమ్మ, మాధవీలత, కోవెలతోట లాంటి తేట తెలుగు మాటలవింటే, ప్రతి తెలుగు వాడి మది పులకరిస్తుంది. ఈ తెనెలోలుకు తియ్యనీ పదాల సృష్టికర్త, సాహితిస్రష్ట శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వర్ధంతి ఈరోజు . ఈ సందర్భంగా దేవులపల్లి వారి స్మరణలో… వారి కలం నుండి. జాలువారిన.. ఓ పదహారణాల ఆణిముత్యము.
మనసున మల్లెల మాలలూగెనె
కనుల వెన్నెల డొలలూగెనె
ఎంత హాయు ఈరేయు నిండెనో
ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో
కోమ్మల గువ్వల సవ్వడి వినినా
రెమ్మల గాలుల సవ్వడి వినినా
ఆలలు కొలనులొ గలగల మనినా
డవుల వెణువు సవ్వడి వినినా నీవువచ్చెవని నీపిలుపె విని
కన్నుల నీరెడి కలయ చూచితిని
గడియె యుక విడిచి పొకుమ
ఎగసిన హృదయము పగులనీకుమ ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండునో
ఎంత హాయు ఈరేయు నిండెనో
Comments

కె.విశ్వనాథ్

(ఎందరో మహానుభావులు...)
“కళాతపస్వి” పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ గారి కి జన్మదిన శుభాకాంక్షలు.

అత్భుతమైన సినికళఖండాలు సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన విశిష్ట వ్యక్తి, కె.విశ్వనాథ్. శ్రీ విశ్వనాథ్ గారు 1930 సంవత్సరము,ఫిబ్రవరి 19 న లో విజయవాడ లో జన్మించారు. మదరసు లోని ఒక స్టూడియోలో టెక్నీషియనుగా సినిమా జీవితప్రస్తానాన్ని మొదలుపెట్టి, ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయకుడిగా చేరారు. అక్కినేని నాగేశ్వరరావు హిరో నటించిన ‘ఆత్మ గౌరవం‘ విశ్వనాథ్ గారికి దర్శకుడిగా మొదటి సినిమా. సిరిసిరిమువ్వ సినిమా ఆయన లోని ప్రతిభను వెలుగులోకి తెచ్చింది. విశ్వనాథ్ గారి చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది ‘శంకరాభరణం‘. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచిపోయింది. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, తెలుగుసినిమాకే కళాసంస్కారం నేర్పింది. పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయ సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు శ్రీ విశ్వనాథ్ గారు. భారతీయ సాంప్రదాయ కళలకు పెద్దపిట వేస్తూ ఆయన మరిన్ని సినిమాలు తీసారు. వాటిలో కొన్ని సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం, స్వరాభిషేకం మొదలైన అణిముత్యాలున్నవి. సాంప్రదాయ కళలూ, సమాజిక స్పౄహ వంటి విభిన్నాంశాలతో సవ్యసాచిలా చిత్రాలు నిర్మించారు. కుల వ్యవస్థ, వరకట్నం వంటి సామాజిక అంశాల తో సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి సినిమాలు నిర్మించారు. అనేక ప్రభుత్వ అవార్డులతోబాటు, ప్రజా రివార్డులని కూడా పొందిన విశ్వనాథ్ గారికి భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది. ఆయన ‘శంకరాభరణం’ కు జాతీయ పురస్కారం తో పాటు ‘సప్తపది’కి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది.
Comments

1 comment:

Valluri Sudhakar said...

అయ్యా! మహేష్ కుమార్ గారు, నా బ్లాగు "దీపిక" లొని అనేక విషయాలు/పొష్టులును, మీరు మీ బ్లాగు "మహేష్" లొ యధతతంగా కాపి చేయటము, అందునా నా బ్లాగు లింకు నే కామెంట్సు కి లంగరు వేయటము ఎంతవరకు సమంజసం చెప్పండి. ఇది మీరు తెలిసిచేసినా, తెలియక చేసిన గర్హనీయం. ఈ విషయం పై అనేకసార్లు మన తెలుగు బ్లాగుర్ల గుంపు పెద్దలు చర్చింటం జరిగింది. కావునా, మీరు వెంటనే మీ బ్లాగుని సరి చూసుకోగలరని, తద్వరా మన తెలుగు బ్లాగరుల సత్సాంప్రదాయలను నిలబెట్టగలరిని ఆశిస్తున్నను.

...వల్లూరి.