Saturday, September 8, 2007
మంచి మిత్రుడు
"ఒక స్నేహితుడి కోసం ప్రాణాలు అర్పించడం అనేది ఏమంత కష్టమైన పని కాదు.కాని ప్రాణాలు అర్పించే ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకోవడం చాలా కష్టమైన పని"లోకంలో మన తల్లి తండ్రుల తరవాత మన హితాన్ని కోరే మూడవ వ్యక్తి మన స్నేహితుడే అన్నాడు శ్రీమాన్ పరవస్తు చిన్న యసూరి గారు.బంధుత్వానికి కులగోత్రాలు కలవాలి కాని స్నేహితానికి అవి అవసరం లేదు.మన స్నేహితుడు మనం పాపకార్యాలు చేస్తుంటే వారిస్తాడు, మన రహస్యాలని బయటకు పొక్కనివ్వడు.మనం కష్టాలలో ఉంటే వదిలి వెళ్ళడు. డబ్బులేక బాధపడుతుంటే సహాయం చేస్తాడు.మంచి మిత్రుడు కంటికి రెప్పలాగ కాపాడుతాడు.కనుక మంచి మిత్రులను మనము సంపాదించుకుందాము. మనము వారికి మంచి మిత్రులగానే ఉందాము. మనము అందరము ఈవిధంగా ఉన్నట్లు అయుతే మన సమాజం తప్పకుండా అమౄతవౄక్షం అవుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment