Thursday, September 6, 2007

MAHESH


నాకు నచ్చిన దైవం సాయినాథుడు

సాయి బాబా బక్తులందరికీ నా నమస్కారములు. నాకు సాయి బాబా అంటే చాలా ఇష్టం. నేను ఏ బాధనైనా, సంతోషన్నైనా బాబాకే చెప్పుకుంటాను. నాకు బాబా ఒక మంచి మిత్రుడు గానే భావిస్తాను.నాకు ఏమైనా బాధ ఉన్నప్పుడు బాబా పాటలు వింటాను. మనసు ప్రశాంతంగా అవుతుంది.ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాయి బాబా పాటలు. బాబా సచ్చరిత్ర చదవడం అంటే చాలా ఇష్టం.అందులో బాబా గురించి చదువుతూ ఉంటే ఎన్నో సార్లు కళ్ళు చెమర్చాయి, అనంద బాష్పాలు వెలువడ్డాయి. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను నేను.ఎవరైనా చదవని వారు ఉంటే మీరు చదివి ఆ ఆనందాన్ని ఆస్వాదించండి. అది చదువుతే ఎవరికైనా మంచి జరుగుతుందని నా నమ్మకం.నేను క్రింద ఒక వెబ్ అడ్రెస్స్ ఇస్తున్నాను.అందులో ఆన్ లైన్ లో మీరు సచ్చరిత్ర ను చదువుకోవచ్చు.http://www.shirdisaiashirvadam.org/importantbooks/sacha/index.htm
ఈ రోజు గురువారం, నాకిష్టమైన రోజు.ఈ సందర్భంగా నాకు నచ్చిన ఒక సాయి గీతం.ఎంతెంత దయనీది ఓ సాయి"2"నిను ఏమని పొగడను సర్వాంతర్యామిఎంతెంత దయనీది ఓ సాయి "2"నిను ఏమని పొగడను సర్వాంతర్యామిఎంతెంత దయనీది ఓ సాయి "2" తొలగించినావు వ్యాధులు ఊదితోవెలిగించినావు దివ్వెలు నీటితో "2"నుడులకు అందవు నుతులకు పొంగవు "2"పాపాలు కడిగేసె పావన గంగవుఎంతెంత దయనీది ఓ సాయి "2"నిను ఏమని పొగడను సర్వాంతర్యామిభక్త కభీరే నీ మతమన్నావుభగవానుడే నీ కులమన్నావు "2" అణువున నిండిన బ్రహ్మాండంలా ఆ ఆ.."2"అందరిలో నేవే కొలువున్నావు ఎంతెంత దయనీది ఓ సాయి"2"నిను ఏమని పొగడను సర్వాంతర్యామిప్రభవించినావు మానవ మూర్తివైప్రసరించినావు ఆరని జ్యోతివై "2"మారుతి నీవే గణపతి నీవే "2"సర్వదేవతల నవ్యాకృతి నీవే ఎంతెంత దయనీది ఓ సాయి "2"నిను ఏమని పొగడను సర్వాంతర్యామిఎంతెంత దయనీది ఓ సాయి "2"బాబా సాయి బాబాబాబా మా సాయి బాబాబాబా బాబా షిరిడి బాబా

No comments: