Thursday, September 6, 2007
ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటపుడు ఎదురు చూసుకొని వెళ్ళాలంటారు. ఎందుకో తెలుసా?
హిందూ సాంప్రదాయాలు పాటించేవాళ్ళు, ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటపుడు తప్పనిసరిగా ఎదురు చూసుకొని వెళ్తారు. ఎందుకంటే మంచి ఎదురు వస్తే వాళ్ళ పని ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుందని వాళ్ళ నమ్మకం. అయితే ఈ ఎదురు చూడడాన్ని ఈ నవతరం కొట్టిపారేస్తుంది. ప్రస్తుత బిజీ జీవితంలో ఎదురుచూడాలంటే కష్టమే మరి. అయితే ఈ ఎదురు చూడడం అనే ప్రక్రియ వెనుక మంచి ఉద్దేశ్యమే ఉంది. అదేమిటంటే మనము బయటకు వెళ్ళే ప్రతీసారీ ఎదురు చూడము. కేవలం ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు మాత్రమే ఎదురు చూస్తాము. ముఖ్యమైన పని అనగానే మనపై సహజంగానే కొంత ఒత్తిడి ఉంటుంది. అలాంటప్పుడు పని తొందరలో ముఖ్యమైన విషయాలు గాని, వస్తువులు గాని ఇంటిలో మరచిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎదురుచూపు అనే మిషతో కాసేపు ఆ వ్యక్తిని ప్రశాంతంగాఉంచగలిగితే తను మరిచిన విషయాలను తను గాని, ఇంటిలోనివారు గాని గుర్తు చేసే అవకాశం వుంది. అంతే కాక తను వెళ్ళే పని తప్పకుండా జరుగుతుందనే ఆత్మ విశ్వాసం కలుగుతుంది. అందుకోసమే ఈ ఎదురుచూపుల ప్రక్రియ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment