Saturday, September 8, 2007

సోమరితనమే శత్రువు

శత్రువుదయ్యం అందరినీ అశ పెడుతుంది,సోమరివాడు దయ్యాన్నే అశ పెడతాడనేది టర్కీ సామెత.అలసత్వం యాచనకు మూలం, వివేకానికి వేరు పురుగన్నది పెద్దలమాట.శరీర సోమరితనమే మనస్సులో అలసత్వానికి కారణం, ఈ అలసత్వం మూర్ఖుల విహార కేంద్రం, బలహీనుల రక్షణ స్థానం, నిరాశ నిస్పౄహలకు మాతౄమూర్తి.ఈ సోమరి తనం నేరాలకు పుట్టిల్లు, వ్యాధులకు మూలస్థానం, కదలని నీరు క్రిములకు స్థావరమైనట్టుగా, సోమరి మనసు కీడు తలపులకు స్థావరమవుతుంది.ఈ సోమరితనాన్ని జయుంచాలంటే ప్రతి మనిషి సోమరితనమే తన మౄత్యువు, కార్యోత్సాహమే తన ప్రాణమని తెలుసుకోవాలి. కార్యసిద్ధి కలగాలంటే నదీ ప్రవాహం లాగ నిరంతరం చైతన్యం వహించాలి.కార్యదీక్ష వహించాలి.

No comments: