శ్రీ పిఠాపురం నాగేశ్వరరావు గారు పాడిన కోన్ని ఆణిముత్యాలు కింద లంకె లో వినగలరు.Music Listing - Music India OnLine
5 Comments
నాకు తెలిసిన కొన్ని సామెతలు
(సామెతలు)
“ఒక కల గంటే తెల్లావరుతుందా”
“కత్తి పొటు తప్పినా, కలం పొటు తప్పదు”
“అన్నపు చొరవే గాని అక్షరం చొరవలేదు”
“ఉలి దెబ్బ తిన్న శిలే శిల్పం అవుతుంది”
“ఏటి ఆవల ముత్యాలు తాటికాయలంత అన్నట్లు”
“పెయ్యను కాపడమని పెద్దపులికి ఇచ్చినట్లు”
“తాడు చాలదని బావి పుడ్చుకున్నట్లు”
“పిల్లిని చంకన పెట్టుకొని పెళ్ళికి వెళ్ళినట్లు”
“నిప్పు ముట్టనిదే చెయి కాలదు”
“చేపపిల్లకు ఈత నేర్పవలేనా?”
4 Comments
మరికొన్ని..
(Uncategorized)
” నేను చదువులో ఏ మాత్రం వెనుక పడినా మా మాష్టారు ఊరుకోరు తెలుసా…?” అన్నాడు రాము.“
ఏం? నీమీద అంత ప్రత్యేకమైన అభిమానమా?” అడిగాడు రవి.
“అదేంగాదు”.“మరి….”“పరీక్ష్లలో మా మాష్టారు గారి అబ్బాయి కూర్చునేది నా వెనకాలే…” __________________________________________________________________________
సరిత: “నువు ప్రేమించిన వ్యక్తి ఎవరినైనా సరే ఎదిరించే దమ్మున్న మగాడని చెప్పావుగా? మరి పెళ్ళీ చేసుకోలేదేం?”
హరిత: :ఆఖరుకు నన్ను కూడా ఎదిరిస్తాడనుకోలేదు”.
__________________________________________________________________________
“మన పెళ్ళి లో మీనాన్న నాకాళ్ళు కడిగెటప్పుడు నా స్టయిల్ భలే ఉంది కదా!” అడిగాడు వీడియో చుస్తూ కొత్తపెళ్ళికోడుకు.
“అప్పుడు మానాన్న లొ నాకు వసుదేవుడు కనిపించాడు లేండి” చూరకంటించింది భార్యమణి.
____________________________________________________________
భార్య: “వంట మనిషిని తీసేసి మీకు వండిపెడితే నాకు ఎంత ఇస్తారు?”భర్త: ” ఇంకా నేను ఇవ్వాల్సిన అవసరమేముందే, నా ఎల్.ఐ.సి. పాలసీ సోమ్మంతా వెంటనే నీకు వచ్చేస్తుందిగా!”
___________________________________________________________________
“మొత్తానికి మన పరంధామయ్య గారి కొడుకులు ముగ్గురు ముగ్గురేనోయ్ “
“అలగా! ఇప్పుడు పెద్దడెక్కడున్నాడు?”
“జైల్లో”..
“రెండోవాడు?”
“బెయిల్లో”…
“మరి మూడోవాడు?”
“పరారీలో”….
_______________________________________________________
ఒక డాక్టర్ పేషేంట్ తో: ” నీకొచ్చిన రోగం ఏమిటో అంతుబట్టడం లేదోయ్. దీనికి కారణం బహుశా మత్తు పదార్దాలు సేవించడం అనుకుంటా”
పేషేంట్: “సర్లేండి డాక్టర్ గారు! మీరు మామూలు స్థితిలో ఉన్నప్పుడే వచ్చి చూపించుకుంటా”
______________________________________________________________________________
2 Comments
శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వర్ధంతి
(ఎందరో మహానుభావులు...)
మావికొమ్మ, కోయలమ్మ, మాధవీలత, కోవెలతోట లాంటి తేట తెలుగు మాటలవింటే, ప్రతి తెలుగు వాడి మది పులకరిస్తుంది. ఈ తెనెలోలుకు తియ్యనీ పదాల సృష్టికర్త, సాహితిస్రష్ట శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వర్ధంతి ఈరోజు . ఈ సందర్భంగా దేవులపల్లి వారి స్మరణలో… వారి కలం నుండి. జాలువారిన.. ఓ పదహారణాల ఆణిముత్యము.
మనసున మల్లెల మాలలూగెనె
కనుల వెన్నెల డొలలూగెనె
ఎంత హాయు ఈరేయు నిండెనో
ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో
కోమ్మల గువ్వల సవ్వడి వినినా
రెమ్మల గాలుల సవ్వడి వినినా
ఆలలు కొలనులొ గలగల మనినా
డవుల వెణువు సవ్వడి వినినా నీవువచ్చెవని నీపిలుపె విని
కన్నుల నీరెడి కలయ చూచితిని
గడియె యుక విడిచి పొకుమ
ఎగసిన హృదయము పగులనీకుమ ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండునో
ఎంత హాయు ఈరేయు నిండెనో
Comments
కె.విశ్వనాథ్
(ఎందరో మహానుభావులు...)
“కళాతపస్వి” పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ గారి కి జన్మదిన శుభాకాంక్షలు.
అత్భుతమైన సినికళఖండాలు సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన విశిష్ట వ్యక్తి, కె.విశ్వనాథ్. శ్రీ విశ్వనాథ్ గారు 1930 సంవత్సరము,ఫిబ్రవరి 19 న లో విజయవాడ లో జన్మించారు. మదరసు లోని ఒక స్టూడియోలో టెక్నీషియనుగా సినిమా జీవితప్రస్తానాన్ని మొదలుపెట్టి, ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయకుడిగా చేరారు. అక్కినేని నాగేశ్వరరావు హిరో నటించిన ‘ఆత్మ గౌరవం‘ విశ్వనాథ్ గారికి దర్శకుడిగా మొదటి సినిమా. సిరిసిరిమువ్వ సినిమా ఆయన లోని ప్రతిభను వెలుగులోకి తెచ్చింది. విశ్వనాథ్ గారి చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది ‘శంకరాభరణం‘. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచిపోయింది. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, తెలుగుసినిమాకే కళాసంస్కారం నేర్పింది. పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయ సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు శ్రీ విశ్వనాథ్ గారు. భారతీయ సాంప్రదాయ కళలకు పెద్దపిట వేస్తూ ఆయన మరిన్ని సినిమాలు తీసారు. వాటిలో కొన్ని సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం, స్వరాభిషేకం మొదలైన అణిముత్యాలున్నవి. సాంప్రదాయ కళలూ, సమాజిక స్పౄహ వంటి విభిన్నాంశాలతో సవ్యసాచిలా చిత్రాలు నిర్మించారు. కుల వ్యవస్థ, వరకట్నం వంటి సామాజిక అంశాల తో సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి సినిమాలు నిర్మించారు. అనేక ప్రభుత్వ అవార్డులతోబాటు, ప్రజా రివార్డులని కూడా పొందిన విశ్వనాథ్ గారికి భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది. ఆయన ‘శంకరాభరణం’ కు జాతీయ పురస్కారం తో పాటు ‘సప్తపది’కి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది.
Comments
Sunday, September 9, 2007
Saturday, September 8, 2007
అంతా మన మంచికే
సుఖమైనా దుఖ్ఖమైనా జీవులకు సంబంధించి అనుభవించవలసిందే తప్ప దాన్ని తప్పించుకునే అవకాశం లేదు.ఏమి జరిగిందో అది బాగా జరిగింది, ఏమి జరుగుతుందో అది బాగా జరుగుతోంది, ఏమి జరగబోతుందో అది కూడ బాగా జరుగుతది అనే ఈ జ్ఞానాన్ని మనసులో నిలుపుకున్న మనిషి కష్టాల కడలిలో చిక్కుకున్నా, దుఖ్ఖమనే పెను తుఫాను చుట్టు ముట్టినా, ఆఖరికీ మరణానికి చేరువ కాబోతున్నా గుండె నిబ్బరంతో నిలుస్తాడు. చరిత్రలో విజేతగా మిగులుతాడు.
గెలుపు
"ఓటమి ఎరుగని వ్యక్తిని అనిపించుకోవడం కన్నా, విలువలను వదులుకోని వ్యక్తిని అనిపించుకోవడం నాకు చాలా ఇష్టం" అన్నాడు ఓ మహావ్యక్తి.అతనే ఐన్ స్టీన్.మనం సాధారణంగా గెలుపు మీదనే శ్రధ్ధ పెడతాము, గెలిచామా లేదా అనేది మనకు ముఖ్యం కాని ఎలా గెలిచామనేది సాధారణంగా పట్టించుకోము. ఐన్ స్టీన్ చెబుతున్నది మాత్రం అది కాదు.ఓటమి ఎదురైనా ఫరవాలేదు విలువలకు మాత్రం ఎక్కడా లోతు రాకూడదని ఆయన అన్నాడు.మహాత్మ గాంధి కూడ అదే అన్నారు."సిధ్ధి కన్న సాధనలు ముఖ్యం" అని.ఏం సాధించావు అనేదాని కన్నా ఎలా సాధించావన్నది ముఖ్యమని బాపూజీ అభిప్రాయం. ఘోరంగా ఓడిపోయునా పరవాలేదు కాని అడ్డదారులు మాత్రం తొక్కరాదు అని నా అభిప్రాయం.
మంచి మిత్రుడు
"ఒక స్నేహితుడి కోసం ప్రాణాలు అర్పించడం అనేది ఏమంత కష్టమైన పని కాదు.కాని ప్రాణాలు అర్పించే ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకోవడం చాలా కష్టమైన పని"లోకంలో మన తల్లి తండ్రుల తరవాత మన హితాన్ని కోరే మూడవ వ్యక్తి మన స్నేహితుడే అన్నాడు శ్రీమాన్ పరవస్తు చిన్న యసూరి గారు.బంధుత్వానికి కులగోత్రాలు కలవాలి కాని స్నేహితానికి అవి అవసరం లేదు.మన స్నేహితుడు మనం పాపకార్యాలు చేస్తుంటే వారిస్తాడు, మన రహస్యాలని బయటకు పొక్కనివ్వడు.మనం కష్టాలలో ఉంటే వదిలి వెళ్ళడు. డబ్బులేక బాధపడుతుంటే సహాయం చేస్తాడు.మంచి మిత్రుడు కంటికి రెప్పలాగ కాపాడుతాడు.కనుక మంచి మిత్రులను మనము సంపాదించుకుందాము. మనము వారికి మంచి మిత్రులగానే ఉందాము. మనము అందరము ఈవిధంగా ఉన్నట్లు అయుతే మన సమాజం తప్పకుండా అమౄతవౄక్షం అవుతుంది.
సోమరితనమే శత్రువు
శత్రువుదయ్యం అందరినీ అశ పెడుతుంది,సోమరివాడు దయ్యాన్నే అశ పెడతాడనేది టర్కీ సామెత.అలసత్వం యాచనకు మూలం, వివేకానికి వేరు పురుగన్నది పెద్దలమాట.శరీర సోమరితనమే మనస్సులో అలసత్వానికి కారణం, ఈ అలసత్వం మూర్ఖుల విహార కేంద్రం, బలహీనుల రక్షణ స్థానం, నిరాశ నిస్పౄహలకు మాతౄమూర్తి.ఈ సోమరి తనం నేరాలకు పుట్టిల్లు, వ్యాధులకు మూలస్థానం, కదలని నీరు క్రిములకు స్థావరమైనట్టుగా, సోమరి మనసు కీడు తలపులకు స్థావరమవుతుంది.ఈ సోమరితనాన్ని జయుంచాలంటే ప్రతి మనిషి సోమరితనమే తన మౄత్యువు, కార్యోత్సాహమే తన ప్రాణమని తెలుసుకోవాలి. కార్యసిద్ధి కలగాలంటే నదీ ప్రవాహం లాగ నిరంతరం చైతన్యం వహించాలి.కార్యదీక్ష వహించాలి.
హనుమాన్ చాలీసా
దోహాశ్రీ గురుచరణ సరోజరజ,నిజమనముకుర సుధారబరణౌ రఘువర విమల యశ,జోదాయక ఫలచారబుద్దిహీన తనుజానికై సుమిరౌ పవన కుమారబలబుధ్ధి విద్యాదేహు మోహిం హరహు కలేశ్ వికార1.జయహనుమాన జ్ఞాన గుణసాగర జయకపీశ తిహులోక ఉజాగర2.రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవన సుతనామ3.మహావీర విక్రమ బజరంగీ కుమతినివార సుమతికే సంగీ4.కంచన వరణ విరాజసువేశ కానన కుండల కుంచిత కెశా5.హాథ వజ్ర ఔద్వజా విరాజై కాంథే మూంజ జనేవూ సాజై6.శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగ వందన7.విద్యావాన గుణి అతిచాతుర రామకాజ కరివేకో ఆతుర8.ప్రభుచరిత్ర సునివేకో రసియా రామలఖన సీత మన బసియా9.సూక్ష్మ రూప ధరి సియహిదిఖావ వికటరూప ధరి లంక జరావ10.భీమరూప ధరి అసుర సమ్హారే రామ చంద్రకే కాజ సవారే11.లాయ సజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరషి వురలాయే12.రఘుపతి కీన్హీ బహుత బడాయి తుమ మమ ప్రియ భరత హి సమభాయి13.సహస వదన తుమ్హరో యశగావై అసకహి శ్రీపతి కంఠలగావై14.సనకాదిక బ్రహ్మాది మునీశా నారద శారద సహిత అహీశా15.యమ కుభేర దిగపాల జహాతే కవికోవిద కహి సకై కహాతే16.తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా రామ మిలాయ రాజపద దీన్హా17.తుమ్హరో మంత్ర విభీషణ మానా లంకేశ్వర భయే సబ జగజానా18.యుగ సహస్ర యోజన పరభానూ లీల్యో తాహి మధుర ఫల జానూ19.ప్రభుముద్రికా మేలిముఖ మహీ జలధి లాంఘిగయే అచరజ నాహీ20.దుర్గమ కాజ జగతకే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే21.రామ దు ఆరే తమ రఖవారే హోతన ఆజ్ఞా బిను పైసారే22.సబ సుఖ లహై తుమ్హారీ సరనా తుమ రక్షక కాహూ కో డరనా23.ఆపన తేజ సమ్హారో ఆపై తీనోం లోక హాంకతే కాంపై24.భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబనామ సునావై25.నాశై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత బలవీరా26.సంకట సే హనుమాన చుడావై మన క్రమ బచన ద్యాన జోలావై27.సబ పర రామ తపస్వీ రాజా తినకే కాజ సకల తుమ సాజా28.ఔర మనోరథ జోకో ఇలావై నోయి అమిత జీవన ఫల పావై29.చారో యుగ పరతాప తుమ్హారా హై పరసిద్ధ జగత ఉజియారా30.సాధు సంతకే తుమ రఖవారే అసుర నికందన రామ దులారే31.అష్ట సిద్ది నవనిధి కే దాతా అస వర దీన జానకీ మాతా32.రామ రసాయన తుమ్హరే పాసా సదా రహో రఘుపతికే దాసా33.తుమ్హరే భజన రామకో పావై జన్మ జన్మకే దుఖ బిసరావై34.అంతకాల రఘుపతి పురజాయీ జహా జన్మ హరిబక్త కహాయీ35.ఔర దేవతా చిత్తన ధరయీ హనుమత సేయు సర్వ సుఖ కరయీ36.సంకట హరై మిటై సబవీరా జో సుమిరై హనుమత బలవీరా37.జైజైజై హనుమాన గోసాయీ కృపాకరో గురుదేవకీనాయీ38.జోహ శతబార పాఠకర జోయీ చూటహి బంది మహా సుఖ హోయీ39.జో యహ పడై హనుమాన చాలీసా హోయసిద్ది సాఖీ గౌరీసా40.తులసీదాస సదా హరిచేరా కీజైనాథ హృదయ మహడేరాదోహాపవనతనయ సంకటహరన మంగళ మూరతి రూప రామలఖన సీతాసహిత హృదయ బసహు సురభూప
Posted by Mahesh at 12:40
Posted by Mahesh at 12:40
Thursday, September 6, 2007
ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటపుడు ఎదురు చూసుకొని వెళ్ళాలంటారు. ఎందుకో తెలుసా?
హిందూ సాంప్రదాయాలు పాటించేవాళ్ళు, ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటపుడు తప్పనిసరిగా ఎదురు చూసుకొని వెళ్తారు. ఎందుకంటే మంచి ఎదురు వస్తే వాళ్ళ పని ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుందని వాళ్ళ నమ్మకం. అయితే ఈ ఎదురు చూడడాన్ని ఈ నవతరం కొట్టిపారేస్తుంది. ప్రస్తుత బిజీ జీవితంలో ఎదురుచూడాలంటే కష్టమే మరి. అయితే ఈ ఎదురు చూడడం అనే ప్రక్రియ వెనుక మంచి ఉద్దేశ్యమే ఉంది. అదేమిటంటే మనము బయటకు వెళ్ళే ప్రతీసారీ ఎదురు చూడము. కేవలం ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు మాత్రమే ఎదురు చూస్తాము. ముఖ్యమైన పని అనగానే మనపై సహజంగానే కొంత ఒత్తిడి ఉంటుంది. అలాంటప్పుడు పని తొందరలో ముఖ్యమైన విషయాలు గాని, వస్తువులు గాని ఇంటిలో మరచిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎదురుచూపు అనే మిషతో కాసేపు ఆ వ్యక్తిని ప్రశాంతంగాఉంచగలిగితే తను మరిచిన విషయాలను తను గాని, ఇంటిలోనివారు గాని గుర్తు చేసే అవకాశం వుంది. అంతే కాక తను వెళ్ళే పని తప్పకుండా జరుగుతుందనే ఆత్మ విశ్వాసం కలుగుతుంది. అందుకోసమే ఈ ఎదురుచూపుల ప్రక్రియ
ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నపుడు, ఆ దరఖాస్తును స్వదస్తూరీ ఉపయోగించి వ్రాయమంటారు. ఎందుకో మీకు తెలుసా?
ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నపుడు, ఆ దరఖాస్తును స్వదస్తూరీ ఉపయోగించి వ్రాయమంటారు. ఎందుకో మీకు తెలుసా?
సాధారణంగా మనము ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నపుడు, ఆ దరఖాస్తును స్వదస్తూరీ ఉపయోగించి వ్రాయమంటారు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కరి వేలిముద్ర ఒకేలా ఎలా ఉండవో అలాగే ఏ ఒక్కరి చేతి వ్రాత కూడా ఒకేలా ఉండదు. మన చేతి వ్రాత మన గురించి ఎన్నో విషయాలు ఎదుటి వారికి తెలియజేస్తుంది. నక్షత్రాలను బట్టి జాతకం చెబితే జ్యోతిష్య శాస్త్రమని, పుట్టిన తారీఖును బట్టి చెబితే సంఖ్యా శాస్త్రమని, అరచేతిలోని రేఖలను బట్టి చెబితే హస్తసాముద్రికం అని ఎలా అంటారో అలాగే మన చేతి వ్రాతను బట్టి మన మనస్తత్వాన్ని విశ్లేషించే శాస్త్రాన్ని చేతి వ్రాత విశ్లేషణా శాస్త్రం లేదా గ్రాఫాలజీ అంటారు. దీనిలో అక్షరాల పరిమాణం, వంపు, పొద్దిక, మార్జిన్ లు, ఒత్తిడి, జారడం, సంతకం వంటి ఎన్నో విషయాలు మన మనస్తత్వాన్ని బయట పెట్టేస్తాయి. అందుకే రక్షణ శాఖ ఉద్యోగాలలో ముందుగా పరిశీలించేది మన చేతి వ్రాతనే. దీని ద్వారా అవతలి వ్యక్తి నమ్మకస్తుడో కాదో తెలుసుకోవచ్చు. అయితే దీని గురించి తెలియని వారు కూడా స్వదస్తూరీ ఉపయోగించి వ్రాయమంటారు ఎందుకో మరి. కొసమెరుపు ఏమిటంటే ఇప్పుడు అమ్మాయిలు తమ ప్రేమికుడును ఎంతవరకూ నమ్మవచ్చూ అనే విషయం తెలుసుకొనేందుకు, వారు వ్రాసిన ప్రేమలేఖలు తీసుకుని గ్రాఫాలజీతో కుస్తీలు పడుతున్నారంట.

MAHESH
మీరు ఎప్పుడయినా గుడి చుట్టూ మూడు సార్లు తిరిగారా? పోనీ గుడిలోకి వెళ్ళి వచ్చి గుడి మెట్లపై కూర్చున్నారా?
మన పెద్దలు మనము ఎప్పుడయినా గుడికి వెళ్ళితే, గుడిలోకి వెళ్ళే ముందు,గుడి చుట్టూ మూడు సార్లు తిరిగామంటారు.అలాగే గుడిలోకి వెళ్ళి దైవ దర్శనం పూర్తి అయిన తరవాత వచ్చి గుడి మెట్లపై కూర్చోమంటారు. ఈ ఆచారం ఎందుకొరకు పెట్టారో తెలుసా? మన పూర్వీకుల కాలంలో శృంగార పరిజ్ఞానం ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నంతగా లేదు. ఇప్పుడు కాలంలో యువత సిడీల ద్వారాను, టివీల ద్వారాను, పుస్తకాల ద్వారానూ శృంగార పరిజ్ఞానం సంపాదిస్తున్నారు. అయితే ఆ కాలంలో శృంగారం గురించి తెలియాలంటే కామ శాస్త్రం చదవాల్సి వుండేది. అయితే అది కేవలం ఉన్నత శ్రేణి వారు లేదా పండితులకు మాత్రమే అర్ధమయ్యే భాషలో ఉండేది. అయితే ఆ కాలంలో స్త్రీలు గడప దాటి బయటకు వచ్చే వారు కాదు. సామన్యులకు సైతం ఈ కామశాస్త్రాన్ని అందుబాటులోనికి తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో, ఈ శాస్త్రాన్ని శిల్పకళగా మలచి అందరూ చూసే అవకాశముండునట్లుగా దేవాలయాలపై నిలిపే వారు. కాబట్టి గుడికి వచ్చే భక్తులందరూ వీటిని దర్శించే ఉద్దేశ్యంతో గుడిలోకి వెళ్ళే ముందు,గుడి చుట్టూ మూడు సార్లు తిరిగామన్నారు. అలాగే గాలి గోపురాలపై ఉండే విగ్రహాలను చూడడానికి వీలుగా గుడిలోకి వెళ్ళి దైవ దర్శనం పూర్తి అయిన తరవాత వచ్చి గుడి మెట్లపై కూర్చోమంటారు. అయితే కొందరు ఈ ఉద్దేశ్యాన్ని గుర్తించలేక అలా తిరిగేటప్పుడు కళ్ళు మూసుకుంటారు. అయితే ఇప్పుడు ఆ శిల్పకళా లేదు. వాటి అవసరమూ కనిపించడం లేదు. అంతగా అభివృద్ది చెందింది మన యువత.

ఆడవారి నోట నువ్వు గింజ నానదు అనే సామెత ఎలా వచ్చిందో తెలుసా?
భారత యుద్దం ముగిసిన తరువాత ధర్మరాజు మరణించిన తన బంధు మిత్రులందరికీ పితృకార్యం చేస్తున్నాడు. ఆ సమయంలో కుంతీదేవి కర్ణుడికి కూడా పితృకార్యం నిర్వహించమని ధర్మరాజుకు చెప్పింది. ఆమె అలా కోరడానికి కారణమేమిటని ధర్మరాజు ఆమెను ప్రశ్నించాడు. అప్పుడు కుంతి తాను కన్యగా వున్నపుడు సూర్యుడి వరం వలన కర్ణుడు తనకు పుట్టిన సంగతి తెలిపింది. ఆ విషయం తెలిసిన ధర్మరాజు ఎంతో దుఃఖించాడు. కర్ణుడు ఆమెకు తమకంటే ముందుగా పుట్టిన కారణంగా అన్న అవుతాడని, అతడిని తమ చేతులారా చంపామని ఎంతో బాధ పడ్డాడు. అతడికి కుంతిపై విపరీతమైన కోపం వచ్చింది. ఆ విషయం ముందేచెప్పివుంటే అతడితో తమకు వైరం వుండేది కాదని, అసలు భారత యుద్డం సంభవించేదే కాదని పలికి ఆమె ఆ రహస్యం అంతకాలంగా దాచబట్టే ఈ దుష్పరిమాణం ఏర్పడిందని చెప్పి "ఇకపై స్త్రీల నోట రహస్యం దాగదు" అని శపించాడు. ఈ భారత గాధ ఆధారంగానే "స్త్రీల నోట నువ్వు గింజ నానదు" అనే సామెత వాడుకలోకి వచ్చింది. నువ్వుగింజ నానడానికి ఎంతోసమయం పట్టదు. అటువంటి నువ్వుగింజ నానే సమయం స్త్రీలు తమ నోట ఇవ్వరని అర్ధం. స్త్రీలు నిరంతరం ఏదో విషయం మాట్లాడతారని, మాట్లాడక ఊరకనే వుండలేరని దీని భావం. కాని సామాజికంగాను, వైజ్ఞానికంగాను స్త్రీలు అభివృద్ది చెందుతున్న ఈ కాలంలో ఈ సామెతకి అర్ధం వుండదని చెప్పవచ్చు.

మీకు కోతి పుండు బ్రహ్మ రాక్షసి అనే సామెత గురించి తెలుసా?
కోతులు సహజంగా సమూహాలుగా గాని, కొన్ని గాని కలసి సంచరిస్తూ ఉంటాయి. అవి చెట్ల మీద నుండి చెట్ల మీదకు ఎగురుతూ వెడుతుంటాయి. ఊళ్ళలొ అయితే ఇళ్ళ ప్రహారీ గోడల మీద ఒకటి వెనుకగా ఒకటి పోతుంటాయి. అలాగే అడవులలో కూడా గుంపులుగానే జీవిస్తుంటాయి. అవి అలా సంచరించేటప్పుడు దెబ్బలు తగలడం వల్ల గాని లేదా వేటగాడు ప్రయోగించిన రాయి లేదా ఆయుధం వల్ల గాని ఒక కోతి గాయపడితే మిగిలిన కోతులు ఆ కోతిని పరామర్శ చేస్తాయి.అలా ప్రతీ కోతి ఆ గాయపడిన కోతిని పరామర్శించేటప్పుడు తన చేతి గోళ్ళతో ఆ గాయాన్ని గోకి చూసి ఏదో ఆకు తెచ్చి దానిమీద వేసి వెడుతుంది. అవి ఆ విధంగా తమ సానుభూతిని, ఆపేక్షను వెల్లడిస్తాయి. కాని ప్రతీ కోతి ఆ గాయాన్ని గోకి చూడడం వల్ల ఆ కోతికి తగిలిన గాయం చిన్నదైనా అది పెద్దగా విస్తరించి చివరికది మానడం దుర్లభమవుతుంది. ఆ కారణంగానే "కోతిపుండు బ్రహ్మ రాక్ష్సి" అనే సామెత వాడుకలోనికి వచ్చింది. ఇది కోతుల నైజాన్ని తెలిపే సామెత. ఆపేక్షతో చేసినప్పటికీ అజ్ఞానులు చేసే పనులు చివరికి బాధగా పరిణమించడాన్ని తెలియజెయడానికి ఈ సామెతతో సూచిస్తారు.

నాకు నచ్చిన కొన్ని మంచి మాటలు.
ఆత్మవిశ్వాసానికి మూలం ప్రశాంతతేప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే ఆహ్లాదకరమైన వాతవరణం తో పరిసరాలు నిండి ఉండాలి.అలాంటి వాతవరణం కావాలంటే ఒత్తిడికి దూరంగా ఉండాలి.ఒత్తిడికి దూరంగా ఉండాలంటే సమస్యలు లేని సందర్భాలతో మమేకమై బతుకు కొనసాగించాలి.మరి ఇది ఎలా నిజ జీవితంలో సాధ్యం? సమస్య ప్రతి జీవికి ఉంటుంది.సమస్య లేని జీవి ఉండడు.అది ఏ రూపంలో నైనా ఉండవచ్చు.దీని మూలంగానే ప్రశాంతతకు దూరంగా బతకనక్కరలేదు.ఎన్ని సమస్యలున్నా ప్రశాంతంగా బతకడం నేరిస్తేనే జీవితాన్ని కాచి ఒడబొసిన వాళ్ళమవుతాము.ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎదురొడ్డి పోరాడి గెలుపును సాధించడమే జీవిత పరమార్థం. సోమరితనమే శత్రువుదయ్యం అందరినీ అశ పెడుతుంది,సోమరివాడు దయ్యాన్నే అశ పెడతాడనేది టర్కీ సామెత.అలసత్వం యాచనకు మూలం, వివేకానికి వేరు పురుగన్నది పెద్దలమాట.శరీర సోమరితనమే మనస్సులో అలసత్వానికి కారణం, ఈ అలసత్వం మూర్ఖుల విహార కేంద్రం, బలహీనుల రక్షణ స్థానం, నిరాశ నిస్పౄహలకు మాతౄమూర్తి.ఈ సోమరి తనం నేరాలకు పుట్టిల్లు, వ్యాధులకు మూలస్థానం, కదలని నీరు క్రిములకు స్థావరమైనట్టుగా, సోమరి మనసు కీడు తలపులకు స్థావరమవుతుంది.ఈ సోమరితనాన్ని జయుంచాలంటే ప్రతి మనిషి సోమరితనమే తన మౄత్యువు, కార్యోత్సాహమే తన ప్రాణమని తెలుసుకోవాలి. కార్యసిద్ధి కలగాలంటే నదీ ప్రవాహం లాగ నిరంతరం చైతన్యం వహించాలి.కార్యదీక్ష వహించాలి.మంచి మిత్రుడు "ఒక స్నేహితుడి కోసం ప్రాణాలు అర్పించడం అనేది ఏమంత కష్టమైన పని కాదు.కాని ప్రాణాలు అర్పించే ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకోవడం చాలా కష్టమైన పని"లోకంలో మన తల్లి తండ్రుల తరవాత మన హితాన్ని కోరే మూడవ వ్యక్తి మన స్నేహితుడే అన్నాడు శ్రీమాన్ పరవస్తు చిన్న యసూరి గారు.బంధుత్వానికి కులగోత్రాలు కలవాలి కాని స్నేహితానికి అవి అవసరం లేదు.మన స్నేహితుడు మనం పాపకార్యాలు చేస్తుంటే వారిస్తాడు, మన రహస్యాలని బయటకు పొక్కనివ్వడు.మనం కష్టాలలో ఉంటే వదిలి వెళ్ళడు. డబ్బులేక బాధపడుతుంటే సహాయం చేస్తాడు.మంచి మిత్రుడు కంటికి రెప్పలాగ కాపాడుతాడు.కనుక మంచి మిత్రులను మనము సంపాదించుకుందాము. మనము వారికి మంచి మిత్రులగానే ఉందాము. మనము అందరము ఈవిధంగా ఉన్నట్లు అయుతే మన సమాజం తప్పకుండా అమౄతవౄక్షం అవుతుంది.గెలుపు "ఓటమి ఎరుగని వ్యక్తిని అనిపించుకోవడం కన్నా, విలువలను వదులుకోని వ్యక్తిని అనిపించుకోవడం నాకు చాలా ఇష్టం" అన్నాడు ఓ మహావ్యక్తి.అతనే ఐన్ స్టీన్.మనం సాధారణంగా గెలుపు మీదనే శ్రధ్ధ పెడతాము, గెలిచామా లేదా అనేది మనకు ముఖ్యం కాని ఎలా గెలిచామనేది సాధారణంగా పట్టించుకోము. ఐన్ స్టీన్ చెబుతున్నది మాత్రం అది కాదు.ఓటమి ఎదురైనా ఫరవాలేదు విలువలకు మాత్రం ఎక్కడా లోతు రాకూడదని ఆయన అన్నాడు.మహాత్మ గాంధి కూడ అదే అన్నారు."సిధ్ధి కన్న సాధనలు ముఖ్యం" అని.ఏం సాధించావు అనేదాని కన్నా ఎలా సాధించావన్నది ముఖ్యమని బాపూజీ అభిప్రాయం. ఘోరంగా ఓడిపోయునా పరవాలేదు కాని అడ్డదారులు మాత్రం తొక్కరాదు అని నా అభిప్రాయం.అంతా మన మంచికేసుఖమైనా దుఖ్ఖమైనా జీవులకు సంబంధించి అనుభవించవలసిందే తప్ప దాన్ని తప్పించుకునే అవకాశం లేదు.ఏమి జరిగిందో అది బాగా జరిగింది, ఏమి జరుగుతుందో అది బాగా జరుగుతోంది, ఏమి జరగబోతుందో అది కూడ బాగా జరుగుతది అనే ఈ జ్ఞానాన్ని మనసులో నిలుపుకున్న మనిషి కష్టాల కడలిలో చిక్కుకున్నా, దుఖ్ఖమనే పెను తుఫాను చుట్టు ముట్టినా, ఆఖరికీ మరణానికి చేరువ కాబోతున్నా గుండె నిబ్బరంతో నిలుస్తాడు. చరిత్రలో విజేతగా మిగులుతాడు.
MAHESH
నాకు నచ్చిన దైవం సాయినాథుడు
సాయి బాబా బక్తులందరికీ నా నమస్కారములు. నాకు సాయి బాబా అంటే చాలా ఇష్టం. నేను ఏ బాధనైనా, సంతోషన్నైనా బాబాకే చెప్పుకుంటాను. నాకు బాబా ఒక మంచి మిత్రుడు గానే భావిస్తాను.నాకు ఏమైనా బాధ ఉన్నప్పుడు బాబా పాటలు వింటాను. మనసు ప్రశాంతంగా అవుతుంది.ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాయి బాబా పాటలు. బాబా సచ్చరిత్ర చదవడం అంటే చాలా ఇష్టం.అందులో బాబా గురించి చదువుతూ ఉంటే ఎన్నో సార్లు కళ్ళు చెమర్చాయి, అనంద బాష్పాలు వెలువడ్డాయి. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను నేను.ఎవరైనా చదవని వారు ఉంటే మీరు చదివి ఆ ఆనందాన్ని ఆస్వాదించండి. అది చదువుతే ఎవరికైనా మంచి జరుగుతుందని నా నమ్మకం.నేను క్రింద ఒక వెబ్ అడ్రెస్స్ ఇస్తున్నాను.అందులో ఆన్ లైన్ లో మీరు సచ్చరిత్ర ను చదువుకోవచ్చు.http://www.shirdisaiashirvadam.org/importantbooks/sacha/index.htm
ఈ రోజు గురువారం, నాకిష్టమైన రోజు.ఈ సందర్భంగా నాకు నచ్చిన ఒక సాయి గీతం.ఎంతెంత దయనీది ఓ సాయి"2"నిను ఏమని పొగడను సర్వాంతర్యామిఎంతెంత దయనీది ఓ సాయి "2"నిను ఏమని పొగడను సర్వాంతర్యామిఎంతెంత దయనీది ఓ సాయి "2" తొలగించినావు వ్యాధులు ఊదితోవెలిగించినావు దివ్వెలు నీటితో "2"నుడులకు అందవు నుతులకు పొంగవు "2"పాపాలు కడిగేసె పావన గంగవుఎంతెంత దయనీది ఓ సాయి "2"నిను ఏమని పొగడను సర్వాంతర్యామిభక్త కభీరే నీ మతమన్నావుభగవానుడే నీ కులమన్నావు "2" అణువున నిండిన బ్రహ్మాండంలా ఆ ఆ.."2"అందరిలో నేవే కొలువున్నావు ఎంతెంత దయనీది ఓ సాయి"2"నిను ఏమని పొగడను సర్వాంతర్యామిప్రభవించినావు మానవ మూర్తివైప్రసరించినావు ఆరని జ్యోతివై "2"మారుతి నీవే గణపతి నీవే "2"సర్వదేవతల నవ్యాకృతి నీవే ఎంతెంత దయనీది ఓ సాయి "2"నిను ఏమని పొగడను సర్వాంతర్యామిఎంతెంత దయనీది ఓ సాయి "2"బాబా సాయి బాబాబాబా మా సాయి బాబాబాబా బాబా షిరిడి బాబా
MAHESH
నా చిన్ననాటి కొన్ని మరిచిపోలేని మధుర జ్ఞాపకాలు.
నన్ను రోజు నాన్న స్కూల్ లో వదిలి రాగానే మళ్ళీ ఏదో ఒక వంక పెట్టుకొని తిరిగి ఇంటికి వచ్చేదాన్ని.మొదటి రోజుల్లో నేను సరిగా స్కూల్ కి వెళ్ళకపోయేదాన్ని.తర్వాత ప్రతి రోజు నిద్రలో లెక్కలు, ఇతర పాఠ్యాంశాలు కలవరించేదాన్ని. ఇప్పటికి నాన్న గుర్తు చేసి చాల నవ్వుతారు ఆ విషయాలు చెబుతూ.నేను హాస్టల్ నుండి సెలవులకి ఇంటికి వచ్చిన ప్రతీసారి నన్ను అమ్మ,నాన్న చాలా ప్రేమగా చూసేవారు.వాళ్ళు నాకు ఎప్పుడూ ఫ్రెండ్స్ లాగా ఉండి నాతో అన్ని షేర్ చేసుకునేవాళ్ళు.నాన్న,నేను కలసి జగిత్యాల్ కి వెళ్ళి చాలా సినిమాలు చూసేవాళ్ళము.అమ్మ ఎప్పుడూ నాన్నకి తెలియకుండా నాకు డబ్బులు ఇచ్చేది.చిన్నప్పటినుంచీ తమ్ముడిని, నన్ను ఎక్కువగా ప్రేమగా పెంచింది అమ్మమ్మ, తాతయ్యలు.వాళ్ళు ఇద్దరు మాతో పాటే ఉంటారు.నానమ్మ,తాతయ్య వాళ్ళు కూడ చాలా ప్రేమ చేసేవాళ్ళు.నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడళ్ళా నాకు డ్రెస్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు.నాన్న మరియు ఒక అంకుల్ రోజు రాత్రి చాల కథలు చెప్పేవాళ్ళు.తమ్ముడిని, నన్ను బాగా నవ్వించే వాళ్ళు ఏదో ఏదో చెప్పి. కాని ఇప్పుదు ఆ అంకుల్ ఈ లోకం లో లేరు.అది చాలా భాధకరమైన విషయం.ఇంకా నాకు ఎక్కువగా నవ్వు తెప్పించే విషయం ఏంటంటే నేను ఎప్పుడు మా ఇంట్లో కూరలు తినకుండా పక్కింట్లోవి తినేదాన్నంట. కాని ఇప్పుడైతే అమ్మ చెసిన ప్రతీది నాకు చాలా ఇష్టం.ఇంకా రోజు ఊరికి వెళ్తున్నా అని బ్యాగ్ సర్దుకొని ఇంట్లో నుండి వెళ్ళేదాన్నట.నేను స్కూల్ నుండి ఒకసారి తిరిగి వస్తుంటే ఒక చిన్న కాలువలో నేను, నా టిఫిన్ బాక్స్ కొట్టుకు పోయాము.అప్పుడు నా చిన్ననాటి స్నేహితుడు ఒకరు కాపాడారు.అదైతే భలే నవ్వు వస్తుంది నాకు.చిన్నప్పుదు డ్యాన్స్ కూడ చేసాను స్కూల్లో.నాకు ఇష్తమైన మా చిన్నప్పటి పంతులు పేరు కిషన్ రావ్. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే, ఇలా చదువుకోవడానికి కారణం అతను నాకు చేసిన భోదనే.

Subscribe to:
Posts (Atom)