Sunday, September 9, 2007

Mahesh

శ్రీ పిఠాపురం నాగేశ్వరరావు గారు పాడిన కోన్ని ఆణిముత్యాలు కింద లంకె లో వినగలరు.Music Listing - Music India OnLine

5 Comments

నాకు తెలిసిన కొన్ని సామెతలు

(సామెతలు)
“ఒక కల గంటే తెల్లావరుతుందా”
“కత్తి పొటు తప్పినా, కలం పొటు తప్పదు”
“అన్నపు చొరవే గాని అక్షరం చొరవలేదు”
“ఉలి దెబ్బ తిన్న శిలే శిల్పం అవుతుంది”
“ఏటి ఆవల ముత్యాలు తాటికాయలంత అన్నట్లు”
“పెయ్యను కాపడమని పెద్దపులికి ఇచ్చినట్లు”
“తాడు చాలదని బావి పుడ్చుకున్నట్లు”
“పిల్లిని చంకన పెట్టుకొని పెళ్ళికి వెళ్ళినట్లు”
“నిప్పు ముట్టనిదే చెయి కాలదు”
“చేపపిల్లకు ఈత నేర్పవలేనా?”
4 Comments

మరికొన్ని..


(Uncategorized)

” నేను చదువులో ఏ మాత్రం వెనుక పడినా మా మాష్టారు ఊరుకోరు తెలుసా…?” అన్నాడు రాము.“
ఏం? నీమీద అంత ప్రత్యేకమైన అభిమానమా?” అడిగాడు రవి.
“అదేంగాదు”.“మరి….”“పరీక్ష్లలో మా మాష్టారు గారి అబ్బాయి కూర్చునేది నా వెనకాలే…” __________________________________________________________________________
సరిత: “నువు ప్రేమించిన వ్యక్తి ఎవరినైనా సరే ఎదిరించే దమ్మున్న మగాడని చెప్పావుగా? మరి పెళ్ళీ చేసుకోలేదేం?”
హరిత: :ఆఖరుకు నన్ను కూడా ఎదిరిస్తాడనుకోలేదు”.
__________________________________________________________________________
“మన పెళ్ళి లో మీనాన్న నాకాళ్ళు కడిగెటప్పుడు నా స్టయిల్ భలే ఉంది కదా!” అడిగాడు వీడియో చుస్తూ కొత్తపెళ్ళికోడుకు.

“అప్పుడు మానాన్న లొ నాకు వసుదేవుడు కనిపించాడు లేండి” చూరకంటించింది భార్యమణి.
____________________________________________________________
భార్య: “వంట మనిషిని తీసేసి మీకు వండిపెడితే నాకు ఎంత ఇస్తారు?”భర్త: ” ఇంకా నేను ఇవ్వాల్సిన అవసరమేముందే, నా ఎల్.ఐ.సి. పాలసీ సోమ్మంతా వెంటనే నీకు వచ్చేస్తుందిగా!”
___________________________________________________________________
“మొత్తానికి మన పరంధామయ్య గారి కొడుకులు ముగ్గురు ముగ్గురేనోయ్ “
“అలగా! ఇప్పుడు పెద్దడెక్కడున్నాడు?”
“జైల్లో”..
“రెండోవాడు?”
“బెయిల్లో”…
“మరి మూడోవాడు?”
“పరారీలో”….
_______________________________________________________
ఒక డాక్టర్ పేషేంట్ తో: ” నీకొచ్చిన రోగం ఏమిటో అంతుబట్టడం లేదోయ్. దీనికి కారణం బహుశా మత్తు పదార్దాలు సేవించడం అనుకుంటా”
పేషేంట్: “సర్లేండి డాక్టర్ గారు! మీరు మామూలు స్థితిలో ఉన్నప్పుడే వచ్చి చూపించుకుంటా”
______________________________________________________________________________
2 Comments

శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వర్ధంతి

(ఎందరో మహానుభావులు...)



మావికొమ్మ, కోయలమ్మ, మాధవీలత, కోవెలతోట లాంటి తేట తెలుగు మాటలవింటే, ప్రతి తెలుగు వాడి మది పులకరిస్తుంది. ఈ తెనెలోలుకు తియ్యనీ పదాల సృష్టికర్త, సాహితిస్రష్ట శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వర్ధంతి ఈరోజు . ఈ సందర్భంగా దేవులపల్లి వారి స్మరణలో… వారి కలం నుండి. జాలువారిన.. ఓ పదహారణాల ఆణిముత్యము.
మనసున మల్లెల మాలలూగెనె
కనుల వెన్నెల డొలలూగెనె
ఎంత హాయు ఈరేయు నిండెనో
ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో
కోమ్మల గువ్వల సవ్వడి వినినా
రెమ్మల గాలుల సవ్వడి వినినా
ఆలలు కొలనులొ గలగల మనినా
డవుల వెణువు సవ్వడి వినినా నీవువచ్చెవని నీపిలుపె విని
కన్నుల నీరెడి కలయ చూచితిని
గడియె యుక విడిచి పొకుమ
ఎగసిన హృదయము పగులనీకుమ ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండునో
ఎంత హాయు ఈరేయు నిండెనో
Comments

కె.విశ్వనాథ్

(ఎందరో మహానుభావులు...)
“కళాతపస్వి” పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ గారి కి జన్మదిన శుభాకాంక్షలు.

అత్భుతమైన సినికళఖండాలు సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన విశిష్ట వ్యక్తి, కె.విశ్వనాథ్. శ్రీ విశ్వనాథ్ గారు 1930 సంవత్సరము,ఫిబ్రవరి 19 న లో విజయవాడ లో జన్మించారు. మదరసు లోని ఒక స్టూడియోలో టెక్నీషియనుగా సినిమా జీవితప్రస్తానాన్ని మొదలుపెట్టి, ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయకుడిగా చేరారు. అక్కినేని నాగేశ్వరరావు హిరో నటించిన ‘ఆత్మ గౌరవం‘ విశ్వనాథ్ గారికి దర్శకుడిగా మొదటి సినిమా. సిరిసిరిమువ్వ సినిమా ఆయన లోని ప్రతిభను వెలుగులోకి తెచ్చింది. విశ్వనాథ్ గారి చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది ‘శంకరాభరణం‘. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచిపోయింది. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, తెలుగుసినిమాకే కళాసంస్కారం నేర్పింది. పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయ సాంప్రదాయ సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించారు శ్రీ విశ్వనాథ్ గారు. భారతీయ సాంప్రదాయ కళలకు పెద్దపిట వేస్తూ ఆయన మరిన్ని సినిమాలు తీసారు. వాటిలో కొన్ని సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం, స్వరాభిషేకం మొదలైన అణిముత్యాలున్నవి. సాంప్రదాయ కళలూ, సమాజిక స్పౄహ వంటి విభిన్నాంశాలతో సవ్యసాచిలా చిత్రాలు నిర్మించారు. కుల వ్యవస్థ, వరకట్నం వంటి సామాజిక అంశాల తో సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి సినిమాలు నిర్మించారు. అనేక ప్రభుత్వ అవార్డులతోబాటు, ప్రజా రివార్డులని కూడా పొందిన విశ్వనాథ్ గారికి భారతీయ సినిమాకు చేసిన సమగ్ర సేవకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది. ఆయన ‘శంకరాభరణం’ కు జాతీయ పురస్కారం తో పాటు ‘సప్తపది’కి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది.
Comments

Saturday, September 8, 2007

అంతా మన మంచికే

సుఖమైనా దుఖ్ఖమైనా జీవులకు సంబంధించి అనుభవించవలసిందే తప్ప దాన్ని తప్పించుకునే అవకాశం లేదు.ఏమి జరిగిందో అది బాగా జరిగింది, ఏమి జరుగుతుందో అది బాగా జరుగుతోంది, ఏమి జరగబోతుందో అది కూడ బాగా జరుగుతది అనే ఈ జ్ఞానాన్ని మనసులో నిలుపుకున్న మనిషి కష్టాల కడలిలో చిక్కుకున్నా, దుఖ్ఖమనే పెను తుఫాను చుట్టు ముట్టినా, ఆఖరికీ మరణానికి చేరువ కాబోతున్నా గుండె నిబ్బరంతో నిలుస్తాడు. చరిత్రలో విజేతగా మిగులుతాడు.

గెలుపు

"ఓటమి ఎరుగని వ్యక్తిని అనిపించుకోవడం కన్నా, విలువలను వదులుకోని వ్యక్తిని అనిపించుకోవడం నాకు చాలా ఇష్టం" అన్నాడు ఓ మహావ్యక్తి.అతనే ఐన్ స్టీన్.మనం సాధారణంగా గెలుపు మీదనే శ్రధ్ధ పెడతాము, గెలిచామా లేదా అనేది మనకు ముఖ్యం కాని ఎలా గెలిచామనేది సాధారణంగా పట్టించుకోము. ఐన్ స్టీన్ చెబుతున్నది మాత్రం అది కాదు.ఓటమి ఎదురైనా ఫరవాలేదు విలువలకు మాత్రం ఎక్కడా లోతు రాకూడదని ఆయన అన్నాడు.మహాత్మ గాంధి కూడ అదే అన్నారు."సిధ్ధి కన్న సాధనలు ముఖ్యం" అని.ఏం సాధించావు అనేదాని కన్నా ఎలా సాధించావన్నది ముఖ్యమని బాపూజీ అభిప్రాయం. ఘోరంగా ఓడిపోయునా పరవాలేదు కాని అడ్డదారులు మాత్రం తొక్కరాదు అని నా అభిప్రాయం.

మంచి మిత్రుడు

"ఒక స్నేహితుడి కోసం ప్రాణాలు అర్పించడం అనేది ఏమంత కష్టమైన పని కాదు.కాని ప్రాణాలు అర్పించే ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకోవడం చాలా కష్టమైన పని"లోకంలో మన తల్లి తండ్రుల తరవాత మన హితాన్ని కోరే మూడవ వ్యక్తి మన స్నేహితుడే అన్నాడు శ్రీమాన్ పరవస్తు చిన్న యసూరి గారు.బంధుత్వానికి కులగోత్రాలు కలవాలి కాని స్నేహితానికి అవి అవసరం లేదు.మన స్నేహితుడు మనం పాపకార్యాలు చేస్తుంటే వారిస్తాడు, మన రహస్యాలని బయటకు పొక్కనివ్వడు.మనం కష్టాలలో ఉంటే వదిలి వెళ్ళడు. డబ్బులేక బాధపడుతుంటే సహాయం చేస్తాడు.మంచి మిత్రుడు కంటికి రెప్పలాగ కాపాడుతాడు.కనుక మంచి మిత్రులను మనము సంపాదించుకుందాము. మనము వారికి మంచి మిత్రులగానే ఉందాము. మనము అందరము ఈవిధంగా ఉన్నట్లు అయుతే మన సమాజం తప్పకుండా అమౄతవౄక్షం అవుతుంది.

సోమరితనమే శత్రువు

శత్రువుదయ్యం అందరినీ అశ పెడుతుంది,సోమరివాడు దయ్యాన్నే అశ పెడతాడనేది టర్కీ సామెత.అలసత్వం యాచనకు మూలం, వివేకానికి వేరు పురుగన్నది పెద్దలమాట.శరీర సోమరితనమే మనస్సులో అలసత్వానికి కారణం, ఈ అలసత్వం మూర్ఖుల విహార కేంద్రం, బలహీనుల రక్షణ స్థానం, నిరాశ నిస్పౄహలకు మాతౄమూర్తి.ఈ సోమరి తనం నేరాలకు పుట్టిల్లు, వ్యాధులకు మూలస్థానం, కదలని నీరు క్రిములకు స్థావరమైనట్టుగా, సోమరి మనసు కీడు తలపులకు స్థావరమవుతుంది.ఈ సోమరితనాన్ని జయుంచాలంటే ప్రతి మనిషి సోమరితనమే తన మౄత్యువు, కార్యోత్సాహమే తన ప్రాణమని తెలుసుకోవాలి. కార్యసిద్ధి కలగాలంటే నదీ ప్రవాహం లాగ నిరంతరం చైతన్యం వహించాలి.కార్యదీక్ష వహించాలి.

హనుమాన్ చాలీసా

దోహాశ్రీ గురుచరణ సరోజరజ,నిజమనముకుర సుధారబరణౌ రఘువర విమల యశ,జోదాయక ఫలచారబుద్దిహీన తనుజానికై సుమిరౌ పవన కుమారబలబుధ్ధి విద్యాదేహు మోహిం హరహు కలేశ్ వికార1.జయహనుమాన జ్ఞాన గుణసాగర జయకపీశ తిహులోక ఉజాగర2.రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవన సుతనామ3.మహావీర విక్రమ బజరంగీ కుమతినివార సుమతికే సంగీ4.కంచన వరణ విరాజసువేశ కానన కుండల కుంచిత కెశా5.హాథ వజ్ర ఔద్వజా విరాజై కాంథే మూంజ జనేవూ సాజై6.శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగ వందన7.విద్యావాన గుణి అతిచాతుర రామకాజ కరివేకో ఆతుర8.ప్రభుచరిత్ర సునివేకో రసియా రామలఖన సీత మన బసియా9.సూక్ష్మ రూప ధరి సియహిదిఖావ వికటరూప ధరి లంక జరావ10.భీమరూప ధరి అసుర సమ్హారే రామ చంద్రకే కాజ సవారే11.లాయ సజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరషి వురలాయే12.రఘుపతి కీన్హీ బహుత బడాయి తుమ మమ ప్రియ భరత హి సమభాయి13.సహస వదన తుమ్హరో యశగావై అసకహి శ్రీపతి కంఠలగావై14.సనకాదిక బ్రహ్మాది మునీశా నారద శారద సహిత అహీశా15.యమ కుభేర దిగపాల జహాతే కవికోవిద కహి సకై కహాతే16.తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా రామ మిలాయ రాజపద దీన్హా17.తుమ్హరో మంత్ర విభీషణ మానా లంకేశ్వర భయే సబ జగజానా18.యుగ సహస్ర యోజన పరభానూ లీల్యో తాహి మధుర ఫల జానూ19.ప్రభుముద్రికా మేలిముఖ మహీ జలధి లాంఘిగయే అచరజ నాహీ20.దుర్గమ కాజ జగతకే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే21.రామ దు ఆరే తమ రఖవారే హోతన ఆజ్ఞా బిను పైసారే22.సబ సుఖ లహై తుమ్హారీ సరనా తుమ రక్షక కాహూ కో డరనా23.ఆపన తేజ సమ్హారో ఆపై తీనోం లోక హాంకతే కాంపై24.భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జబనామ సునావై25.నాశై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత బలవీరా26.సంకట సే హనుమాన చుడావై మన క్రమ బచన ద్యాన జోలావై27.సబ పర రామ తపస్వీ రాజా తినకే కాజ సకల తుమ సాజా28.ఔర మనోరథ జోకో ఇలావై నోయి అమిత జీవన ఫల పావై29.చారో యుగ పరతాప తుమ్హారా హై పరసిద్ధ జగత ఉజియారా30.సాధు సంతకే తుమ రఖవారే అసుర నికందన రామ దులారే31.అష్ట సిద్ది నవనిధి కే దాతా అస వర దీన జానకీ మాతా32.రామ రసాయన తుమ్హరే పాసా సదా రహో రఘుపతికే దాసా33.తుమ్హరే భజన రామకో పావై జన్మ జన్మకే దుఖ బిసరావై34.అంతకాల రఘుపతి పురజాయీ జహా జన్మ హరిబక్త కహాయీ35.ఔర దేవతా చిత్తన ధరయీ హనుమత సేయు సర్వ సుఖ కరయీ36.సంకట హరై మిటై సబవీరా జో సుమిరై హనుమత బలవీరా37.జైజైజై హనుమాన గోసాయీ కృపాకరో గురుదేవకీనాయీ38.జోహ శతబార పాఠకర జోయీ చూటహి బంది మహా సుఖ హోయీ39.జో యహ పడై హనుమాన చాలీసా హోయసిద్ది సాఖీ గౌరీసా40.తులసీదాస సదా హరిచేరా కీజైనాథ హృదయ మహడేరాదోహాపవనతనయ సంకటహరన మంగళ మూరతి రూప రామలఖన సీతాసహిత హృదయ బసహు సురభూప
Posted by Mahesh at 12:40

Thursday, September 6, 2007

ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటపుడు ఎదురు చూసుకొని వెళ్ళాలంటారు. ఎందుకో తెలుసా?

హిందూ సాంప్రదాయాలు పాటించేవాళ్ళు, ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటపుడు తప్పనిసరిగా ఎదురు చూసుకొని వెళ్తారు. ఎందుకంటే మంచి ఎదురు వస్తే వాళ్ళ పని ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుందని వాళ్ళ నమ్మకం. అయితే ఈ ఎదురు చూడడాన్ని ఈ నవతరం కొట్టిపారేస్తుంది. ప్రస్తుత బిజీ జీవితంలో ఎదురుచూడాలంటే కష్టమే మరి. అయితే ఈ ఎదురు చూడడం అనే ప్రక్రియ వెనుక మంచి ఉద్దేశ్యమే ఉంది. అదేమిటంటే మనము బయటకు వెళ్ళే ప్రతీసారీ ఎదురు చూడము. కేవలం ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు మాత్రమే ఎదురు చూస్తాము. ముఖ్యమైన పని అనగానే మనపై సహజంగానే కొంత ఒత్తిడి ఉంటుంది. అలాంటప్పుడు పని తొందరలో ముఖ్యమైన విషయాలు గాని, వస్తువులు గాని ఇంటిలో మరచిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎదురుచూపు అనే మిషతో కాసేపు ఆ వ్యక్తిని ప్రశాంతంగాఉంచగలిగితే తను మరిచిన విషయాలను తను గాని, ఇంటిలోనివారు గాని గుర్తు చేసే అవకాశం వుంది. అంతే కాక తను వెళ్ళే పని తప్పకుండా జరుగుతుందనే ఆత్మ విశ్వాసం కలుగుతుంది. అందుకోసమే ఈ ఎదురుచూపుల ప్రక్రియ